భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

ఆగష్టు 15న నేడు భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది…
ఆజాద్ ఇక అమృత మహోత్సవ పేరుతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా ప్రచారం ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచింది..

ఈ ప్రత్యేక రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ జెండా వందనం జరిగింది. తెలంగాణాలో ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి జెండాను ఎగరవేశారు. 75 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి అణచివేత పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించింది. ఈ రోజున భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అసంఖ్యాక సైనికులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భారతదేశంలోని ప్రతి పౌరుడు స్మరించుకుంటాడు.