ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్..

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ (India) ముందు వరుసలో ఉంటుంది. అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ.. భారత్ దూసుకెళ్తోంది. అన్ని రంగాల్లో భారత్ వేగంగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా టెక్నాలజీని (Technology) అందిపుచ్చుకోవడంలో.. కొత్త టెక్నాలజీలను సృష్టించడంతో భారత్ ముందుంది. అంతరిక్ష పరిశోధనల్లో కూడా భారత్ సత్తా చాటుతోంది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించింది..ఇదిలా ఉండగా ఫోర్స్బ్ ఇండియా (Forbes India).. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా అభివృద్ధి చెందిన టాప్ 10 దేశాల జాబితాను ప్రకటించింది. అందులో భారత్ 5వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం భారత జీడీపీ (GDP) 3750 బిలియన్ డాలర్లుగా ఉంది. తలసరి ఆదాయం దేశ వారీగా జీడీపీ 2,601 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే భారత వార్షిక జీడీపీ వృద్ధిరేటు 5.9 శాతంగా ఉంది. ఇక ఆ జాబితాలో 26,854 బిలియన్ డాలర్ల జీడీపీతో మొదటి స్థానంలో అమెరికా (America) ఉండగా.. రెండో స్థానంలో 19374 బిలియన్ డాలర్ల జీడీపీతో చైనా (China) ఉంది. ఇక 2080 బిలియన్ డాలర్ల జీడీపీతో బ్రెజిల్ 10వ స్థానంలో కొనసాగుతోంది.