రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో గెలిచిన భారత్… సిరీస్ కైవసం

శ్రీలంకతో కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా, మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. .ఈ మ్యాచ్ లో తొలుత శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం, 216 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 43.2 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. కేఎల్ రాహుల్ 64 పరుగులతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. హార్దిక్ 36, శ్రేయాస్ అయ్యర్ 28, గిల్ 21, అక్షర్ పటేల్ 21 పరుగులు చేశారు. లంక బౌలర్లలో లహిరు కుమార 2, చామిక కరుణరత్నే 2, కసున్ రజిత 1, ధనంజయ డిసిల్వా 1 వికెట్ తీశారు. కోహ్లీ 4 పరుగులకే అవుట్ కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తో సిరీస్ ఫలితం తేలడంతో, నామమాత్రపు చివరి వన్డే ఈ నెల 15న తిరువనంతపురంలో జరగనుంది.