భారత్‌కు చైనా తొ అతిపెద్ద భద్రతా ముప్పుగా మారింది… డిఫెన్స్ స్టాఫ్‌ చీఫ్ జనరల్ బిపిన్ రావత్

భారత్, చైనాల మధ్య సరిహద్దు సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్‌కు చైనా అతిపెద్ద భద్రతా ముప్పుగా మారిందని డిఫెన్స్ స్టాఫ్‌ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. దేశ సరిహద్దులను కాపాడుకునేందుకు గతేడాది తరలించిన సైన్యం, ఆయుధ సామగ్రి ఇప్పట్లో తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాద పరిష్కారం విషయంలో విశ్వాస లోపం.. అనుమానాలే అడ్డుపడుతున్నాయని చెప్పారు. ఇదే విషయమై గత నెలలో ఇరు దేశాల మిలిటరీ కమాండర్ల మధ్య జరిగిన 13వ రౌండ్ చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి.గల్వాన్‌ లోయలో ఘర్షణలు మొదలు.. ఇరు దేశాలు సరిహద్దుల వెంబడి మౌలిక సదుపాయాల కల్పన, బలగాల మోహరింపు చేపడుతున్నట్లు జనరల్ రావత్ చెప్పారు. మరోవైపు ఎక్కడైనా.. ఎటువంటి విపత్కర పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు…