ఆందోళన కలిగిస్తోన్న కరోనా మృతుల సంఖ్య..మళ్లీ పెరిగిన కొత్త కేసులు..

తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరిగిన కొత్త కేసులు*

ఆందోళన కలిగిస్తోన్న మృతుల సంఖ్య*

దేశంలో కరోనా ముప్పు తొలగిపోలేదు.

వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. 

కొన్నిసార్లు భారీగా తగ్గుతున్న కొత్త కేసులు..

హఠాత్తుగా పెరుగుతుండటమే అందుకు కారణం. 

గత రెండు రోజులుగా 20 వేల దిగువన నమోదైన కేసులు.. తాజాగా ఆ మార్కును దాటాయి.

మృతుల సంఖ్య కూడా 300పైనే నమోదైంది.

ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది.

తాజాగా 14,31,819 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..

22,431 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ..

అంతకుముందు రోజుతో పోల్చితే కేసుల్లో 19 శాతం మేర పెరుగుదల కనిపించింది.

నిన్న 318 మంది ప్రాణాలు కోల్పోయారు.

దాంతో మొత్తం కేసులు 3.38 కోట్లకు చేరగా..

ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4.49 లక్షలకు చేరింది.

అలాగే ఒక్క కేరళలోనే 12 వేల కేసులు, 134 మరణాలు సంభవించాయి.

ప్రస్తుతం 2.44లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు.

క్రియాశీల రేటు 0.72 శాతంగా ఉండగా..

రికవరీ రేటు 97.95 శాతానికి చేరింది.

నిన్న 24 వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

ఇప్పటివరకు మహమ్మారిని జయించిన వారి సంఖ్య 3.32 కోట్లకు చేరింది.

మరోపక్క బుధవారం 43,09,525 మంది కరోనా టీకా వేయించుకున్నారు.

నిన్నటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 92,63,68,608కి చేరింది..