ఉత్తరాదిని వణికించిన భూకంపం..

ఉత్తరాదిని భూకంపం వణికించింది.
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం భూకంపం (Earthquake) సంభవించింది. దేశ రాజధాని సహా పరిసర ప్రాంతాలైన పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
రిక్టర్ స్కేలుపై 5.7గా తవ్రత నమోదు అయింది. ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్‌‌లలో ప్రకంపనలు వచ్చాయి. జమ్ముకశ్మీర్‌లో భూమి కంపించింది. భూప్రకంపనల నేపథ్యంలో ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు తీశారు. జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఇటు మణిపూర్‌లో సైతం 10 సెకన్ల పాటు భూమి కంపించింది..