సెప్టెంబరులో భారత్‌లో జీ20 సమ్మిట్..

సెప్టెంబరులో భారత్‌లో జీ20 సమ్మిట్..
భారత్‌లో జీ20 సమ్మిట్ సెప్టెంబరులో జరగనుంది. ఈ కీలక శిఖరాగ్ర సమావేశం కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. అయితే, ఈ సమావేశాలకు ఢిల్లీలోని రీ డెవలప్‌డ్ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) కాంప్లెక్స్‌ వేదిక కానుంది. ITPO కాంప్లెక్స్ (ప్రగతి మైదాన్ కాంప్లెక్స్) ను దాదాపు 123 ఎకరాల విస్తీర్ణంలో .. అత్యంత సుందరంగా పునఃర్మించారు. ప్రపంచంలోనే అతి పెద్ద కాంప్లెక్స్‌ లలో ఐటీపీఓ కాంప్లెక్స్ MICE (మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు) ఒకటిగా నిలవనుంది. రూ.2700 కోట్ల వ్యయంతో భారతదేశ సంస్కృతి, కళలను చాటిచెప్పేలా కన్వెన్షన్‌ సెంటర్‌ను అత్యాధునికంగా సకల సౌకర్యాలతో పునర్‌నిర్మించారు. కాగా.. ITPO కాంప్లెక్స్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజాకార్యక్రమాల్లో పాల్గొని ప్రధాని మోడీ పూజలు చేశారు.