శ్రీలంకపై 238 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం..

బెంగళూరు టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం..

శ్రీలంకపై 238 పరుగుల తేడాతో గెలుపు,

2-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా..

బెంగళూరు టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. శ్రీలంక జట్టు పై ఏకంగా 238 పరుగుల తేడాతో గెలుపొందింది టీం ఇండియా. రెండో ఇన్నింగ్స్ లో లో కేవలం 208 పరుగులకే ఆల్ అవుట్ అయిన శ్రీలంక… టీం ఇండియాకు గ్రాండ్ విక్టరీ ని అందించింది. ఈ మ్యాచ్ లో లో మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 252 పరుగులు చేసి ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 303 పరుగులు చేసి డిక్లేర్ చేసింది…400 పైగా పరుగులు టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు ఆది నుంచి ఎదురు దెబ్బలు తింటూనే ఉంది. దీంతో మూడోరోజు 59 ఓవర్లు ముగిసే సమయానికి 208 పరుగులకు ఆలౌటైన శ్రీలంక. ఇక మొదటి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే శ్రీలంక ఆలౌటైంది…ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే.. బూమ్రా మూడు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ మరియు అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసి టీమిండియాకు గ్రాండ్ విక్టరీని అందించారు.దీంతో 2-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది టీమిండియా..