బ్రిటీలు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార, అమితాబచ్చన్ లాంటి వాళ్ళు మాల్దీవులను బాయ్ కాట్ చేయాలన్నట్లుగా ట్వీట్లు..

అసలా దేశం ఉన్నదే పిడికిడంత. ఒకపుడు అక్కడి ప్రభుత్వం భారత్ అనుకూలంగా ఉండేది. మొన్నటి నవంబర్లో ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన పార్టీభారత్ వ్యతిరేక స్టాండ్ తీసుకోవటమే కాకుండా చైనాకు బాగా దగ్గరవుతోంది.

ఇదే సమయంలో ఈమధ్యనే నరేంద్రమోడీ మాల్దీవులకు వెళ్ళారు. అడ్వచర్ టూరిజంను ఇష్టపడే ప్రేమికులందరు మాల్దీవులకు రావాల్సిందే అని ఒక ట్వీట్ పెట్టారు. ఎందుకంటే మోడీ కూడా తన పర్యటనలో సముద్రంలోపలకి వెళ్ళి అడ్వంచర్ చేశారు. తర్వాతే ట్వీట్ పెట్టారు. మాల్దీవుల టూరిజంను ప్రమోట్ చేశారు. ఈ ట్వీట్ ను మాల్దీవుల మంత్రులు ముగ్గురు చాలా అవహేళనచేశారు. మోడీతో పాటు భారత్ ను చాలా చులకనగా మాట్లాడారు. మోడీ ప్రమోట్ చేయకపోతే, భారతీయులు అడుగుపెట్టకపోతే మాల్దీవులకు వచ్చే నష్టం ఏమిటంటు ఎద్దేవాచేశారు..నిజానికి మాల్దీవుల ఆదాయం టూరిజం అండ్ ఫిషింగ్ మాత్రమే. అందులో టూరిజం అంటే భారతీయులు విపరీతంగా వెళుతుంటారు. మాల్దీవుల టూరిజంలో భారతీయుల వాట కనీసం 12 శాతం. అంటే మాల్దీవుల ఎకానమిలో భారతీయుల పాత్ర ఎంతుందో అర్ధమవుతోంది. ఏడాదికి సుమారు 2.5 లక్షల మంది వెళుతుంటారని అంచనా. ఎప్పుడైతే మోడీ, బారత్ ను అవహేళన చేస్తున్నట్లు మంత్రులు మాట్లాడారో మనవాళ్ళందరికీ మండింది. సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార, అమితాబచ్చన్ లాంటి వాళ్ళు మాల్దీవులను బాయ్ కాట్ చేయాలన్నట్లుగా ట్వీట్లు పెట్టారు. ఇంకేముంది ఒక్కసారిగా దేశమంతా స్పందించింది…ఇప్పటికి 8 వేల బుకింగ్స్ ను బారతీయులు క్యాన్సిల్ చేసుకున్నారు. అలాగే 2 వేల ఫ్లైట్ టికెట్లను కూడా రద్దుచేసుకున్నారు. మాల్దీవుల్లో బుక్ చేసుకున్న హోటళ్ళు రిసార్టులను కూడా భారతీయులు రద్దు చేసుకుంటున్నారు. దాంతో మాల్దీవుల ప్రభుత్వానికి ఒక్కసారిగా మంటెక్కిపోయింది. దిద్దుబాటు చర్యలకు దిగింది. మోడీ, భారత్ పై అవహేళనగా మాట్లాడిన ముగ్గురు మంత్రులపై వేటువేసింది. ముందు ముందు ఇంకేమి పరిణామాలు జరగబోతున్నాయో చూడాలి…