భారత్‌- సెమీస్ లో ఆస్ట్రేలియాపై విజయం.. ఇదో ఊహించని అద్భుతా విజయం…!.

భారత మహిళా క్రికెట్ జట్టు ఎవరూ ఊహించని అద్భుతాన్ని చేసింది. మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 89 పరుగుల ఇన్నింగ్స్, జెమిమా రోడ్రిగ్జ్ సెంచరీ సహాయంతో భారత్ 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ ఈ మ్యాచ్‌ను 9 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ విజయం అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా 8 సంవత్సరాల తర్వాత ప్రపంచకప్ మ్యాచ్‌ను ఓడిపోయింది. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో ఇంత పెద్ద రన్‌ను ఛేదించడం ఏ జట్టుకైనా ఇదే మొదటిసారి…

మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women’s World Cup) భారత అమ్మాయిలు (Team India) సంచలన బ్యాటింగ్‌తో ఫైనల్‌ చేరారు. గ్రూప్‌ దశలో అభిమానులు ఆశించిన స్థాయిలో ఆడలేక తడబడ్డ భారత్‌.. కీలక సెమీస్‌ పోరులో మాత్రం అంచనాలకు మించి దుమ్మురేపింది. నవీ ముంబైలోని డాక్టర్‌ డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరిగిన రెండో సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి 8 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత సగర్వంగా ఫైనల్‌ చేరింది. ఆసీస్‌ నిర్దేశించిన 339 పరుగుల రికార్డు ఛేదనను భారత్‌.. మరో ఆరు తొమ్మిది బంతులు మిగిలుండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక ఛేదనను విజయవంతంగా పూర్తిచేసింది. ఛేదనలో జెమీమా రోడ్రిగ్స్‌ (134 బంతుల్లో 127 నాటౌట్‌, 14 ఫోర్లు) తన కెరీర్‌లోనే మరుపురాని శతకంతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (88 బంతుల్లో 89, 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోరు చేసింది. యువ ఓపెనర్‌ ఫొబె లిచ్‌ఫీల్డ్‌ (93 బంతుల్లో 119, 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకంతో కదం తొక్కగా ఎల్లీస్‌ పెర్రీ (88 బంతుల్లో 77, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆష్లే గార్డ్‌నర్‌ (45 బంతుల్లో 63, 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఫిఫ్టీలతో రాణించారు. జెమీమాకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో భారత్‌.. నవంబర్‌ 2న ఇదే వేదికలో దక్షిణాఫ్రికాతో టైటిల్‌ పోరులో తలపడనుంది. ఈ పోరులో ఎవరు గెలిచినా వరల్డ్‌ కప్‌లో అభిమానులు కొత్త విజేతను చూడబోతున్నారు…

జెమీమా వీరోచితం : నిర్దేశిత భారీ లక్ష్యఛేదనలో భారత్‌కు మెరుగైన శుభారంభం దక్కలేదు. ప్రతీకా రావల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ఓపెనర్‌ షెఫాలీవర్మ(10) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మెగాటోర్నీలో సూపర్‌ ఫామ్‌మీదున్న స్మృతి మందనకు ఫస్డ్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రోడ్రిగ్స్‌ జత కలిసింది. వీరిద్దరు ఆసీస్‌ బౌలింగ్‌ను నిలువరిసూ ఇన్నింగ్స్‌ ముందుకు నడిపించారు. గాడిలో పడిందనుకుంటున్న తరుణంలో గార్త్‌ బౌలింగ్‌లో బంతిని లెగ్‌సైడ్‌ ఆడబోయిన మందన..అనూహ్య రీతిలో ఔటైంది. 59 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ బాధ్యతను రోడ్రిగ్స్‌తో పాటు హర్మన్‌పీత్‌ భుజానేసుకున్నారు. వీరిద్దరు ఎక్కడా చెత్తషాట్లకు పోకుండా లక్ష్యాన్ని అంతకంతకూ కుదించే ప్రయత్నం చేశారు. ఇదే మెగాటోర్నీలో రెండుసార్లు డకౌట్‌ అయిన రోడ్రిగ్స్‌..సెమీస్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. ఆదిలో నెమ్మదిగా ఆడిన కౌర్‌.. అర్ధ సెంచరీ తర్వాత దూకుడు పెంచింది. మరో ఎండ్‌లో రోడ్రిగ్స్‌..అలనా కింగ్‌ బౌలింగ్‌లో కీపర్‌ హిలీ క్యాచ్‌ విడిచిపెట్టడంతో దక్కిన చాన్స్‌ను చక్కగా వాడుకుంది. లక్ష్యం దిశగా సాగుతున్న క్రమంలో సదర్లాండ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన కౌర్‌.. గార్డ్‌నర్‌ సూపర్‌ క్యాచ్‌తో ఔటైంది. దీంతో మూడో వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. ఆ తర్వాత దీప్తిశర్మతో రోడ్రిగ్స్‌ జతకట్టింది. సెంచరీ పూర్తి చేసుకున్నా..సంబురాలు చేసుకోని రోడ్రిగ్స్‌ జట్టు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగింది. అయితే లేని పరుగు కోసం ప్రయత్నించిన దీప్తి రనౌట్‌ కాగా, రీచా ఘోష్‌ తనదైన దూకుడుతో ఆసీస్‌ బౌలర్లను మరింత ఒత్తిడిలోకి నెట్టింది. సదర్లాండ్‌ బౌలింగ్‌లో గార్త్‌ క్యాచ్‌తో రీచా నిష్క్రమించగా, ఆఖర్లో అమన్‌జ్యోత్‌(15 నాటౌట్‌)తో కలిసి రోడ్రిగ్స్‌ను జట్టును ఒడ్డుకు చేర్చింది..

మొత్తం 30 రోజుల పాటు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు, కొన్ని షాకింగ్ ఫలితాల తర్వాత ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనలిస్ట్‌లు ఎవరనేది తేలిపోయింది. నవంబర్ 2, ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనున్న ఫైనల్‌లో భారత్, సౌతాఫ్రికా మధ్య టైటిల్ కోసం పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై టీమిండియా చారిత్రక, ప్రపంచ రికార్డు విజయం సాధించడంతో ఈ ఫైనల్ ఖరారైంది. దీంతో 25 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మహిళా క్రికెట్‌కు ఒక కొత్త ఛాంపియన్ లభించడం ఖాయమైంది…

టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. ఇంతకు ముందు 2017లో చివరిసారి ఫైనల్ ఆడింది. అయితే మొట్టమొదట 2005లో భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకునే అవకాశం దగ్గర వరకు వచ్చింది. గత రెండు ఫైనల్స్‌లోనూ భారత జట్టు ఓటమిని ఎదుర్కొంది. 2005లో ఆస్ట్రేలియా చేతిలో, 2017లో విజయం అంచున ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. కాగా, సౌతాఫ్రికా తొలిసారిగా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు, 2017, 2022లో రెండుసార్లు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. కానీ ఈసారి లారా వోల్వార్ట్ కెప్టెన్సీలో ఆఫ్రికా జట్టు తమ పాత లెక్కలను సరిచేసింది…