ఇండోనేషియాలో భారీ భూకంపం… సునామీ హెచ్చ‌రిక‌లు జారీ

సముద్రంలో తలెత్తిన ఈ భూకంపం వల్ల సునామీ తలెత్తొచ్చని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఇండోనేషియా భూకంపం వార్తలపై భారత్ సైతం అప్రమత్తం అవుతుంది. తాజా భూకంపం తీవ్రతలో పెద్దది కావడం, దాని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ….
ఇండోనేషియాలో ఇవాళ భారీ భూకంపం సంభ‌వించింది. మౌమెరికి 95 కిలోమీట‌ర్ల ఉత్త‌రంలో భూకంపం కేంద్రీకృత‌మైంది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్రత‌ 7.6గా ఉన్న‌ట్లు అమెరికా జియోలాజిక‌ల్ స‌ర్వే తెలిపింది. ఈ నేప‌థ్యంలో సునామీ హెచ్చ‌రిక‌ల‌ను ఇండోనేషియా జారీ చేసింది. యురోపియ‌న్‌-మెడిట‌రేనియ‌న్ సెసిమాల‌జిక‌ల్ సెంట‌ర్ భూకంప తీవ్ర‌త‌ను 7.7గా అంచ‌నా వేసింది. ఫ్లోరేస్ స‌ముద్రంలో సుమారు 18.5 కిలోమీట‌ర్ల లోతులో భూకంపం సంభ‌వించిన‌ట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. తెల్ల‌వారుజామున 3. 20 నిమిషాల‌కు భూకంపం వ‌చ్చింది. అయితే భూకంప కేంద్రం నుంచి సుమారు వెయ్యి కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు ప్ర‌మాద‌క‌ర‌మైన సునామీ త‌రంగాలు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప‌సిఫిక్ సునామీ వార్నింగ్ సెంట‌ర్ హెచ్చ‌రించింది.