ఇండోనేషియా దేశంలో భారీ భూకంపం….

ఇండోనేషియా దేశంలో భారీ భూకంపం సంభవించింది…భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఈ భూకంపం వల్ల 10,000 భవనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి.ఈ భూకంపం ధాటికి పసమన్ బరాత్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు, పసమాన్ జిల్లాలో మరో నలుగురు మరణించారు.ఈ విపత్తు వల్ల మొత్తం 85 మంది గాయపడ్డారని ఇండోనేషియా అధికారులు చెప్పారు.ఈ భూకంపం వల్ల 5వేలమంది ప్రజలు 35 సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు.భూకంపం ప్రభావం వల్ల పలువురు తప్పిపోవడంతో వారికోసం సైనికులు,వాలంటీర్లు గాలిస్తున్నారు.పసమన్ బరాత్ జిల్లాకు ఈశాన్యంగా 12 కిలోమీటర్ల దూరంలో భూమి కింద 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. బాధితుల్ని ఆదుకునేందుకు ఇంకా రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. కనిపించకుండా పోయిన ప్రజల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఐదు వేల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, 35 ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేశారు.