అఫ్గానిస్తాన్‌పై భారత్ విజయం..

టీమిండియా బ్యాట్స్‌మెన్లు… దుమ్ములెప్పేరు..
ఓపెనర్లు రోహిత్ శర్మ (74..47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు)…
కేఎల్ రాహుల్‌ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)..
హార్దిక్ పాండ్యా (35),
పంత్‌ (27).
R9TELUGUNEWS.COM
టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌ (74), రాహుల్‌ (69) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (35), పంత్‌ (27) మెరుపులతో భారత్‌ 210 పరుగుల భారీ స్కోరు సాధించింది…
20 ఓవర్ల లో కేవలం రెండు వికెట్లు కోల్పోయి… ఏకంగా 210 పరుగులు చేసింది టీమిండియా. కేఎల్‌ రాహుల్‌ 69 పరుగులు, రోహిత్‌ శర్మ 74 పరుగులు, రిషబ్‌ పంత్‌ 27 నాటౌట్‌, హర్ధిక్‌ పాండ్యా 35 పరుగు చేసి.. జట్టుకు భారీ స్కోర్‌ ను అందించారు…….20 ఓవర్లు ముగిసే సరికి 144/7తో నిలిచింది. విజయానికి 67 పరుగులు దూరంలో నిలిచిపోయింది. భారత బౌలర్లలో షమీ 3, అశ్విన్ 2 వికెట్లు ఖాతాలో వేసుకోగా.. బుమ్రా, జడేజా చెరో వికెట్ కూల్చారు. టీమిండియాకు అద్భుత ఆరంభం అందించిన రోహిత్‌ శర్మకు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ లభించింది..

పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో కంగుతిన్న టీమిండియా.. అఫ్గానిస్థాన్‌పై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి 66 పరుగుల తేడాతో విజయం సాధించింది..