ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ సేవలకు అంతరాయం..

ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తుంది.
ఈ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో కొత్త ఫీడ్ లోడ్ కావట్లేదు.. దీంతో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. మరో వైపు ఇన్స్టాగ్రామ్ తో పాటు ఫేస్ బుక్ సేవలు సైతం నిలిచిపోయినట్లు సమాచారం. అందులోను పలు సమస్యలు తలెత్తినట్లు తెలుస్తుంది…