ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అవిభక్త కవలలు వీణ,వాణి..
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవిభక్త కవలలు వీణ, వాణి తమ సత్తా చాటారు. ఇంటర్మీడియట్‌లో వారిద్దరూ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. ఇంటర్‌లో సీఈసీ కోర్సును అభ్యసించిన వీణకు 712, వాణికి 707 మార్కులు వచ్చాయి.ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్.. వీణ, వాణిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వారి ఉన్నత చదువులకు, భవిష్యత్‌కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వీణ, వాణిలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. వీణ – వాణిల చదువుకు సహకరించిన అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేకంగా అభినందించారు.
అయితే వీరిద్దరూ ఇంటర్ పరీక్షలు స్వయంగా రాశారు. ఇక పదో తరగతిలోనూ వీణ, వాణి ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. వీణ 9.3 జీపీఏ, వాణి 9.2 జీపీఏ సాధించారు.