తెలంగాణలో స్కూళ్ల ఓపెనింగ్ కోసం అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం….ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే…

తెలంగాణలో ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి స్కూళ్ళు ప్రారంభం కాబోతున్నాయి. స్కూళ్ల ఓపెనింగ్ కోసం అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇక ఈ ఏడాది మే 17 నుంచి పదోతరగతి పరీక్షలు జరగబోతున్నాయి. పదోతరగతి పరీక్షలు మొదలయ్యేలోపు ఇంటర్ పరీక్షలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటిస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మే 15 వ తేదీలోపు ఇంటర్ పరీక్షలను పూర్తి చేయాలనీ నిర్ణయించినట్టు విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రతిరోజూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ క్లాసులు జరుగుతున్నాయని అన్నారు. స్కూళ్లలో శానిటేషన్ బాధ్యత స్థానిక సంస్థలు చూసుకోవాలని అన్నారు. విద్యాసంస్థల్లో మిషన్ భగీరథ వాటర్ ఏర్పాటు చేస్తామని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.