రేపు తెలంగాణలో ఇంటర్ కళాశాలల బంద్.

రేపు తెలంగాణలో ఇంటర్ కళాశాలల బంద్..

R9TELUGUNEWS.COM : తెలంగాణలో రేపు ఇంటర్ కళాశాలల బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఎన్ఎస్‌యూఐ ప్రకటించింది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఇంటర్ బోర్డు వైఖరేనని ఎన్ఎస్‌యూఐ మండిపడుతున్నారు. విద్యార్థుల కోసం తాము పోరాడుతుంటే ఇంటర్ బోర్డు కనీసం స్పందించకుండా పోలీసుల చేత తమను అక్రమంగా అరెస్ట్ చేయిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఇంటర్ ఫలితాలపై అధికారులతో మాట్లాడేందుకు వెళ్లిన ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు.