నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం..ఆవిర్భావం గురించి తెలుసుకోండి….

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. భారతీయ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రిచి ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది.

ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. చికాగోలో 1908 మే 3, న్యూయార్క్లో 1909 ఫిబ్రవరి 28న జరిగాయి. 1910 ఫిబ్రవరి 27, రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా 1910 ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగింది. అమెరికా సామ్యవాదులచే ఉత్తేజితులై, జర్మన్ సామ్యవాది లూయీస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్ధించారు. 17 దేశాలనుండి వచ్చిన 100 మహిళలు మహిళలకు ఓటుహక్కుతో పాటు సమానహక్కులు సాధించడానికి సరియైన వ్యూహమని అంగీకరించారు,తదుపరి సంవత్సరం 1911 మార్చి 19న పదిలక్షలమంది పైగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో 1911 మార్చి 19 న మహిళా దినోత్సవం ఆచరించారు. ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యంలో300 పైగా ప్రదర్శనలు జరిగినవి. వియన్నాలో రింగ్ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు.మహిళలు ఓటుహక్కు, ప్రభుత్వ పదవుల హక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు.. అమెరికాలో ఫిబ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు.

1913 లో రష్యను మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. (అప్పటికి రష్యాలో జూలియన్ కాలెండర్ అమలులో ఉంది.)

1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేవీ మార్చి 8న జరగలేదు.అయితే 1914 నుండి ఆ రోజుని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించివుండవచ్చు కానీ, అప్పటినుండే అన్నీ దేశాల్లోనూ మార్చి 8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు. 1914 లో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. అయితే,1918 గానీ వారికి ఓటు హక్కు రాలేదు.

1917 లో ఫిబ్రవరి విప్లవం ఆ నెల చివరి ఆదివారం సెయుంట్ పీటర్స్ బర్గ్లో మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మొదలయ్యింది.
( గ్రెగేరియన్ కాలెండరు ప్రకారం ఆ తారీఖు మార్చి 8). ఆ రోజు సెయింట్ పీటర్ బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్ధం, రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు. దీన్నే ‘బ్రెడ్డు, శాంతి’ డిమాండుగా వ్యవహరించారు. లియోన్ ట్రోస్కీ ప్రకారం, ‘ఆ రోజే ఒక విప్లవానికి పునాదులు పడతాయని ఎవరూ ఊహించలేదు. వస్త్ర పరిశ్రమల్లోని మహిళా శ్రామికులందరూ పై అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు. అవే విప్లవానికి తొలి అడుగులు”.

అక్టోబర్ విప్లవం తరువాత సోవియట్ యూనియన్లో ఆ రోజుని అధికారిక సెలవు దినంలా ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కొలెన్టైల్ లు, వ్లాదిమిర్ లెనిన్ని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. కానీ, 1965 వరకూ అది అమల్లోకి రాలేదు. అదే సంవత్సరం సోవియట్ మహిళలు అప్పటి వరకు చూపిన సాధికారత స్మారకార్థం, మార్చి 8న యుయస్సార్ ప్రభుత్వం ఆ దినాన్ని అధికారక సెలవు దినంగా ప్రకటించింది.1917 సోవియట్ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు. 1922 నుంచి చైనావారు, 1936 నుంచి స్పానిష్ వారు దీనిని అధికారికంగా ప్రకటించుకున్నారు. 1949 అక్టోబర్ 1 లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడినది. వారి రాష్ట్రీయ మండలి డిసెంబరు 23న, మార్చి ఎనిమిదిని అధికారిక దినంగా ఉత్తర్వులిస్తూ, చైనా మహిళలకి ఆ రోజు సగం సెలవు ప్రకటించింది.

అప్రాచ్య దేశాల్లో, 1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కులు, ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది.

1980 దశకంలో రినీ కోట్ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది.

భారతదేశంలో మహిళా హక్కుల పోరాటం..
భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో అనసూయా సారాభాయ్ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి చట్టాలను చేయబడినవి. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావంవలన ప్రైవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాల అమలు కుంటుబడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలలో మహిళలు పాల్గొనడం, నేతృత్వం వహించడం మెరుగుపడవలసివుంది.

*_యు.యెస్.ఎ లో అధికారిక గుర్తింపు_*

మానవహక్కుల ఉద్యమకారిణి, నటి బేతా పోజ్నియక్ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపును, ప్రభుత్వ సెలవుదినాన్ని సాధించేందుకు లాస్ ఏంజిల్స్ నగరానికి మేయరు, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి కృషిచేశారు. 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తించేలా బిల్లును రూపొందించడం ద్వారా సాకారం చేశారు.

*_మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం సవరించు_*

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2022 మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మహిళలకు భారత పురావస్తు విభాగం పరిధిలో ఉండే అన్ని ప్రాచీన కట్టడాలను ఈ రోజున ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది.

*_2021 అంతర్జాతీయ మహిళా దినోత్సవం_*

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం 2021 ఐక్యరాజ్య సమితి ఇతివృత్తం “నాయకత్వంలోని మహిళలు: కోవిడ్-19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం”, కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా బాలికలు, మహిళలు ఆరోగ్య సంరక్షణ కార్మికులు, సంరక్షకులు, ఆవిష్కర్తలు, సమాజ నిర్వాహకులుగా చూపిన ప్రభావాన్ని ఎత్తిచూపారు.

*_2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం_*

ఈ ఏడాది అంతర్జాతీయ మహిళాదినోత్సవం థీమ్ #BreakTheBias – Imagine a gender equal world అంటే లింగ సమానత్వాన్ని సాధించడానికి 2022 సంవత్సరం కీలకమైనది.