నేడే ఐపీఎల్‌ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ , చెన్నై x దిల్లీ.. ఫైనల్‌ కి చేరేది ఎవరో…….

నేడే ఐపీఎల్‌ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌

*సీనియర్ల చెన్నైతో యువ దిల్లీ ఢీ…
గెలిస్తే నేరుగా తుదిపోరుకు..ఓడిన మరో అవకాశం..రాత్రి7:30pm ప్రారంభం…
సీనియర్లతో నిండి ‘డాడీస్‌ ఆర్మీ’గా పేరు తెచ్చుకున్న జట్టు ఓ వైపు.. యువ ఆటగాళ్లతో ఉరకలెత్తుతున్న బృందం మరో వైపు! ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచిన జట్టు ఒకటి.. గత మూడు సీజన్లుగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న టీమ్‌ ఇంకోటి.. ఇప్పటికే మూడు సార్లు ట్రోఫీ సొంతం చేసుకున్న జట్టు అటు.. తొలి ఐపీఎల్‌ టైటిల్‌ కోసం పోరాడుతున్న జట్టు ఇటు! ఇప్పుడా రెండు జట్లు ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ఫైనల్లో చోటు కోసం తలపడుతున్నాయి. ఆదివారం తొలి క్వాలిఫయర్‌లో పోటీపడనున్న ఆ జట్లే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌.
మరి ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టేదెవరో చూడాలి. ఓడిన జట్టుకు టైటిల్‌ పోరు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది.