IPL 2022. చెన్నై పై కోల్‌క‌తా విజయం..

తొలిసారి కెప్టెన్ గా బరిలోకి దిగిన రవీంద్ర జడేజాకు ఈ మ్యాచ్ నిరాశనే మిగిల్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది. టీం మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని (38 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. రవీంద్ర జడేజా (28 బంతుల్లో 26 నాటౌట్; 1 సిక్స్), రాబిన్ ఉతప్ప (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ఫర్వాలేదనిపించారు….వాంఖడే లాంటి బ్యాటింగ్ పిచ్ పై 132 పరుగులను ఛేదించడం అంటే పెద్ద కష్టమేమి కాదు. అందులోనూ శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్ లాంటి హిట్టర్లు ఉన్న టీంకు ఈ స్కోరు పెద్ద స్కోరు కూడా కాదు. ఛేజింగ్ లో కేకేఆర్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసి గెలుపొందింది. కేకేఆర్ ఇన్నింగ్స్ ను ఆరంభించిన అజింక్యా రహానే (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (16) శుభారంభం చేశారు. వన్ డౌన్ లో వచ్చిన నితీశ్ రాణా (21) కూడా రాణించడంతో కేకేఆర్ ఛేజింగ్ సాఫీగానే సాగింది. అయితే బ్రావో రెండు వికెట్లు తీయడం… సాంట్నర్ బౌలింగ్ లో రహానే అవుటవ్వడంతో మ్యాచ్ పై కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే క్రీజులో ఉన్న శ్రేయస్ అయ్యర్ (20 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్), స్యామ్ బిల్లింగ్స్ (21 బంతుల్లో 25; 1 ఫోర్ ,1 సిక్స్) కేకేఆర్ కు విజయాన్ని ఖాయం చేశారు…

ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌క‌తా బ్యాట్స్‌మ‌న్ మంచి ప్ర‌ద‌న్శ‌న చేశారు. ర‌హానే 44, వెంక‌టేశ్ అయ్య‌ర్ 16, నితిష్ రాణా 21, శ్యాం బిల్లింగ్స్ 25 ప‌రుగులు చేశారు. కాగా, శ్రేయ‌స్ అయ్య‌ర్ 20, షెల్డ‌న్ జాక్స‌న్ 3 ప‌రుగులతో నాటౌట్‌గా నిలిచారు. 133/4..