నేడు లక్నో సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు IPLలో తమ మొదటి మ్యాచ్‌లో తలపడుతున్నాయి…

నేడు లక్నో సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు IPLలో తమ మొదటి మ్యాచ్‌లో తలపడుతున్నాయి…

ఐపీఎల్ 2022లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పోరాడే స్కోర్ చేసింది. ల‌క్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 రన్స్ చేసి.. గుజరాత్ ముందు 159 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాప్ ఆర్డర్ విఫలమయినా.. దీపక్ హుడా (55; 41 బంతుల్లో 6×4, 2x 6), ఆయుష్ బదోని (54; 41 బంతుల్లో 4×4, 3x 6) జట్టును ఆదుకున్నారు. అద్భుత హాఫ్ సెంచరీలతో జట్టుకు గౌరవమైన స్కోర్ అందించారు. ఇన్నింగ్స్ చివరలో కృనాల్ పాండ్యా 13 బంతుల్లో 21 రన్స్ చేశాడు. గుజరాత్ పేసర్ మొహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టాడు. …ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టుకు మొహ్మద్ షమీ భారీ షాక్ ఇచ్చాడు. మ్యాచ్ మొదటి బంతికే లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. రెండో ఓవర్ మూడో బంతికి క్వింటన్ డీకాక్ (7)ను షమీ ఔట్ చేయగా.. మూడో ఓవర్ మూడో బంతికి ఎవిన్ లూయిస్ (10)ను వరుణ్ ఆరోన్ వెనక్కి పంపాడు. ఇక నాలుగో ఓవర్ మూడో బంతికి మనీష్ పాండే (6)ను షమీ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో లక్నో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కనీసం వంద పరుగులైనా చేస్తుందా అనిపించింది…

గుజరాత్ టైటాన్స్ 3వ వికెట్ కోల్పోయింది. క్రునాల్ పాండ్య బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య క్యాచ్ ఔట్ అయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ టైటాన్స్ స్కోర్ 72/3…