హైదరాబాద్ జట్టు తొలి విజయం సాధించిందోచ్…
చెన్నై సూపర్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 155 పరుగుల లక్ష్యాన్ని మరో 14 బంతులు మిగిలుండగానే అందుకుంది ఆరెంజ్ ఆర్మీ...
చెన్నై సూపర్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 155 పరుగుల లక్ష్యాన్ని మరో 14 బంతులు మిగిలుండగానే అందుకుంది ఆరెంజ్ ఆర్మీ..
ఐపీఎల్ 2022 సీజన్లో నేడు మరో ఆసక్తికర పోరు జరిగింది. ప్రస్తుత సీజన్లో విజయం కోసం ఎదరుచూస్తున్న సీఎస్కే, ఎస్ఆర్హెచ్ జట్లు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలినట్లైంది. నిర్ణీత 20 ఓవర్ల 7 వికెట్లను కొల్పోయిన సీఎస్కే 154 స్కోర్‌ను ఎస్ఆర్హెచ్ ముందు ఉంచింది.
ఫేవరేట్ చెన్నైపై , srh గెలిచి సత్తాచాటింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 రన్స్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కేన్ మామ జట్టు అద్భుతంగా రాణించింది. ఆచి తూచి ఆడుతూ.. విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ.. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో 3 వికెట్లు కోల్పోయిన SRH మరో ఓవర్ ఉండగానే 155 రన్స్ చేసి ఫస్ట్ విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజస్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హైదరాబాద్ చెన్నైపైనే విక్టరీ కొట్టి షాక్ ఇచ్చింది. ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో బోణీ కొట్టి.. పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రూ.6.5 కోట్ల ఆటగాడు అభిషేక్ శర్మ తన డబ్బుకి మొదటి సారి న్యాయం చేశాడు. అభిషేక్ శర్మ 50 బంతుల్లో 75 పరుగులతో రాణించాడు. విలియమ్సన్ 40 బంతుల్లో 32 పరుగులతో.. శర్మకు చక్కటి సహకారం అందించాడు. ఆఖర్లో త్రిపాఠి 15 బంతుల్లో 39 రన్స్‌తో చెలరేగాడు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి, డ్వేన్ బ్రేవోకు చెరో వికెట్ దక్కింది..