ఉత్కంఠ భరిత పోరులో చెన్నైపై ‘లక్నో’ సూపర్ విక్టరీ…

లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇది తొలి విజయం కాగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌కు ఇది రెండో ఓటమి.

IPL 2022 LSG vs CSK… ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గురువారం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టోర్నీలోని తమ తొలి మ్యాచుల్లో ఓడిన ఇరు జట్లు….మొదటి విజయం కొసం ఎదురుచూశాయి….
IPL టోర్నీలో భాగంగా మొట్టమొదటి విజయం సాధించిన LSG..
లక్నో సూపర్ జెయింట్స్ టీమ్. నిర్ణీత 20 ఓవర్లలో 3 బంతులు మిగిలి ఉండగానే.. 210 పరుగుల లక్ష్యాన్ని చేధించి ఘన విజయాన్ని నమోదు చేసింది. ముంబయిలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఇక 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో బ్యాట్స్‌మెన్.. తొలి నుంచి దుమ్మురేపే ఫార్ఫార్మెన్స్‌ చూపెట్టారు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ రెచ్చిపోయారు ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్. ఈ ఇద్దరూ కలిసి 99 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్ అందించారు…
ధాటిగా ఆడుతున్న కెప్టెన్​ రాహుల్​(40)..ప్రీటోరియస్ బౌలింగ్​లో అంబటి రాయుడి చేతికి చిక్కి పెవిలియన్​ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీశ్​ పాండే ఐదు పరుగులకే వెనుదిరిగాడు. మెరుగ్గా రాణిస్తున్న ఓపెనర్​ క్వింటన్​ డికాక్​(61)ను సైతం ప్రీటోరియస్ ఔట్ చేశారు. ఎవిన్ లూయిస్‌ (55*) , ఆయుష్ బదోని(19*) మెరుపు ఇన్నింగ్స్​తో మ్యాచ్​ను ముగించారు. చెన్నై బౌలర్లలో డ్వేన్​​ ప్రీటోరియస్ 2, తుషార్​ దేశ్​ పాండే, బ్రావో చెరో వికెట్ తీశారు….టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన చెన్నై.. ఆది నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నాలుగు పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్ రాబిన్ ఊతప్ప పరుగుల వరద పారించాడు. ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సుతో 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చి మొయిన్ అలీ(22 బంతుల్లో 35) సైతం ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. శివమ్ దుబె(30 బంతుల్లో 49), అంబయి రాయుడు(27), రవీంద్ర జడేజా(17), ఆఖర్లో ధోనీ(16) రాణించడం వల్ల.. చెన్నై భారీ స్కోరు సాధించింది. ఆఖరి 6 ఓవర్లలో ఆ జట్టు 79 పరుగులు సాధించి. మొత్తం 7 వికెట్లు కోల్పోయింది….

చెన్నై జట్టు...

బ్యాటింగ్: ఊతప్ప 50, రుతురాజ్ గైక్వాడ్ 1, మొయిన్ 35, శివమ్ దూబె 49, రాయుడు 27, రవీంద్ర జడేజా 17, ధోని 16, బ్రావో 1.
బౌలింగ్: తుషార్ దేశ్‌పాండె 1, డ్వేన్ బ్రావో 1, ప్రిటోరియస్ 2..

లక్నో జట్టు..

బ్యాటింగ్: కేఎల్ రాహుల్(40), క్వింటన్ డికాక్(61), మనీష్ పాండే(5), ఎవిన్ లేవిస్(55)*, దీపక్ హుడా(13), ఆయుష్ బదోని(19)*.
బౌలింగ్: అవేష్ ఖాన్ 2, ఆండ్రూ టై 2, రవి బిషోని 2…