ముంబైపై గెలిచిన బెంగ‌ళూరు……

ముంబైకి నాలుగో పరాజయం.. ఆర్సీబీకి హ్యాట్రిక్ విజయం...

ముంబయి ఇండియన్స్​పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు. ..

152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అనూజ్ రావత్ (66), విరాట్ కోహ్లీ (48) మెరుగ్గా రాణించారు. డుప్లెసిస్ (16) ఫర్వాలేదనిపించాడు. దీంతో హ్యాట్రిక్​ గెలుపును అందుకున్న బెంగళూరు.. ముంబయికి నాలుగో మ్యాచ్​లోనూ ఓటమిని కట్టబెట్టింది. ముంబయి బౌలర్లలో జయదేవ్​ ఉనద్కత్​, డెవాల్డ్​ బ్రెవిస్​ చెరో వికెట్ పడగొట్టారు….పూణె వేదికగా జరిగిన మ్యాచులో ముంబైపై ఆర్సీబీ సూపర్ విక్టరీ కొట్టింది. 152 పరుగుల టార్గెట్ ను ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది ఆర్సీబీ. దీంతో ఏడు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఆర్సీబీకి ఇది హ్యాట్రిక్ విజయం కాగా.. ముంబైకి వరుసగా నాలుగో పరాజయం. అనూజ్ రావత్ ( 47 బంతుల్లో 66 పరుగులు ; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ ( 36 బంతుల్లో 48 పరుగులు ; 5 ఫోర్లు) రాణించాడు…

అంతకు ముందు…సూర్యకుమార్ యాదవ్ చెలరేగాడు.37 బంతుల్లో 5 ఫోర్లు,6 సిక్సులతో 68 పరుగులు చేసి ముంబైని ఆదుకున్నాడు.దీంతో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 151 స్కోర్ చేసింది. బెంగళూరుకు 152 లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబైకి మంచి ఓపెనింగ్ దక్కింది. రోహిత్ శర్మ 26, ఇషాన్ కిషాన్ 26 పరుగులతో రాణించారు…..