ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ లీగ్‌కు సంబంధించిన వేదికలతో పాటు మ్యాచ్‌లు నిర్వహించే తేదీలను శనివారం ప్రకటించిన బీసీసీఐ తాజాగా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. దీని ప్రకారం.. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఇక టోర్నీ ప్లే ఆఫ్ మ్యాచ్‌లతో పాటు, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి. కాగా.. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 30 వరకు జరగనుంది. ఈ టోర్నీ మొత్తం 52 రోజుల పాటు 60 మ్యాచ్‌లుగా జరగనుంది.