ఛాలెంజర్స్ బెంగళూరు పై చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం..

2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి పోరులో ఆర్సీబీ నిర్దేశించిన 174 పరుగుల టార్గెట్ ను 18.4 ఓవర్లలోనే ఛేదించింది..జట్టులో రచిన్ రవీంద్ర 37 పరుగులు చేయగా, రహానే 27 పరుగులతో రాణించారు. చివర్లో శివమ్ దూబే 34 పరుగులు చేయగా. రవీంద్ర జడేజా 25 పరుగులతో మెరుపులు మెరిపించి.. ఆజట్టును విజయ తీరాలకు చేర్చారు. బెంగళూరు బౌలర్లలో కామెరూన్ గ్రీన్ రెండు వికెట్లు తీశాడు. యశ్ దయాల్, కర్ణ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.

అంతక ముందు మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెన్లరుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 21 పరుగులు చేయగా.. ఫాఫ్ డుప్లెసిస్ 35 పరుగులు చేశారు. ఆ తరవాత బ్యాటింగ్ కు దిగిన రజతన్ పాటిదర్, గ్లేన్ మ్యాక్స్ వెల్ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత కెమెరన్ గ్రీన్ 18 పరుగులు చేశాడు.అయితే ఒక దశలో బెంగళూరు 78 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అనుజ్ రావత్ (48), దినేష్ కార్తీక్ (38) చివరకు ఉండటంతో.. ఆర్సీబీ గౌరవ ప్రదమమైన స్కోరు చేసింది. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్ కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ లో ముస్తాఫిజుర్ రెహమాన్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ కు ఒక వికెట్ దక్కింది. మిగతా బౌలర్లలో ఎవరూ వికెట్ సంపాదించలేదు.