పంజాబ్ కింగ్స్‌ పై ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాస విజయం….

ఐపీఎల్ 2022లో భాగంగా ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాస విజయం సాధించింది. పంజాబ్ నిర్ధేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 10.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌లు డేవిడ్ వార్నర్ (60 నాటౌట్; 30 బంతుల్లో 10×4, 1×6), పృథ్వీ షా (41; 20 బంతుల్లో 7×4, 1×6) దంచికొట్టారు. షా ఔటైనప్పటికీ సర్ఫరాజ్‌ ఖాన్‌ (12)తో కలిసి వార్నర్‌ ఢిల్లీని విజయతీరానికి చేర్చాడు. ఈ సీజన్లో ఢిల్లీ ఆరు మ్యాచులు ఆడి మూడు విజయాలు అందుకుంది. ఆరు పాయింట్లతో ప్రస్తుతం ఆరో స్థానంకు దూసుకొచ్చింది.