ఐపీఎస్ అధికారి భార్య తనూజా రంజన్ హత్య కేసులో విచారణ వేగవంతం
హత్య, దోపిడీ చేసిన తర్వాత నిందితులు నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి పారిపోయినట్లు గుర్తింపు
నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన కమిషనర్
ముంబై, లక్నో, ఢిల్లీలకు బృందాలను పంపించిన అధికారులు
నేపాల్ సరిహద్దు ప్రాంతానికి ఇప్పటికే చేరుకున్న అధికారులు..
గతంలో కల్పన లక్నోలో పనిచేసిన ఇంటికి వెళ్లి.. ఇంటి యజమాలను విచారించిన పోలీసులు..
కల్పనతో పాటు ఉన్న ఇద్దరు యువకులు ఎవరన్నది గుర్తించేందుకు పోలీసుల ప్రయత్నాలు..
పనిమనిషి కల్పన గత చరిత్రను తెలుసుకుంటున్న పోలీసులు..
ఇల్లు, నాంపల్లి స్టేషన్ వద్ద దొరికిన సీసీటీవీ ఫోటోలు విడుదల చేసిన పోలీసులు…
దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు
నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని పోలీస్ కమిషనర్ ఆదేశించగా, ఇందుకోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చేరుకున్నాయి. ముంబై, లక్నో, ఢిల్లీ ఈ నగరాల్లో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు దేశం దాటే అవకాశం ఉండటంతో, ప్రత్యేక బృందాలు ఇప్పటికే నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నాయి…
పనిమనిషి కల్పన గత చరిత్రపై ఆరా
ఈ కేసులో ప్రధాన అనుమానితురాలుగా భావిస్తున్న పనిమనిషి కల్పన నేపథ్యంపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో లక్నోలో కల్పన పనిచేసిన ఇంటికి వెళ్లిన పోలీసులు, అక్కడి ఇంటి యజమానులను విచారించి ఆమె గురించి కీలక వివరాలు సేకరించారు. హత్య జరిగిన సమయంలో కల్పనతో పాటు ఉన్న ఇద్దరు యువకులు ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విచారణలో భాగంగా పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. నిందితుల కదలికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించారు. తనూజా రంజన్ నివాసం వద్ద, అలాగే నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో దొరికిన నిందితుల ఫోటోలను పోలీసులు అధికారికంగా విడుదల చేశారు. ప్రజలు వీరిని గుర్తించి సమాచారం అందించాలని కోరుతున్నారు..