ఇరాన్ జంట బాంబుపేలుళ్లకు మేమే కారణం.!.

ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాజీ చీఫ్ ఖాసిం సులేమానీ స్మారకార్థం, ఆయన హత్యకు గురై నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా.. ఇరాన్ లోని కెర్మాన్‌లో శ్రద్ధాంజలి ఘటించేందుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.ఈ సమయంలో జరిగిన రెండు భారీ బాంబు పేలుళ్లలో 103 మంది మరణించారు. అయితే ఈ దాడి తమ పనే అని ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించింది. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత అంతటి శక్తివంతమైన నాయకుడిగా ఖాసిం సులేమానికి పేరుంది. ఇరాన్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో, బాగ్దాద్‌లో అతడిని అమెరికా హతమార్చింది. డ్రోన్ ద్వారా అతను ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని పేల్చేసింది. ఈ ఘటన 2020లో జరిగింది. అతను మరణించి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అతని స్వస్థలం కెర్మాన్ లోని సాహెబ్ అల్ జమాన్ సమీదు సమీపంలో పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో 170 మంది మరణించినట్లు ఇరాన్ స్టేట్ మీడియా వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ బాంబు దాడులకు అమెరికా, ఇజ్రాయిల్ కారణమని ఇరాన్ నిందించింది…