ఇరాన్ సైన్యం సంచలన వీడియో విడుదల..రండి.. తేల్చుకుందాం.. మేము మీకోసమే ఎదురుచూస్తున్నాం’…!

యుద్ధం తీవ్రతరమవుతోన్న వేళ ఇరాన్ సైన్యం సంచలన వీడియోను రిలీజ్ చేసింది. ఇరాన్ టెలివిజన్ ప్రెస్ టీవీ ప్రసారం చేసిన 59 సెకెన్లు నిడివి కలిగిన ఈ వీడియోలో అమెరికా సైన్యాలతో ఢీకొట్టి, ఓడించేందుకు తమ కమాండోలు సిద్ధంగా ఉన్నారని టెహ్రాన్ హెచ్చరించింది. ఇరాన్ సైనికులు పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారనేది ఈ వీడియో ద్వారా స్పష్టం చేసింది. బ్యాక్ గ్రౌండ్‌లో మ్యూజిక్‌తో ఇరాన్ ప్రత్యేక దళాల విన్యాసాలు చేస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. ‘దగ్గరకు రండి.. తేల్చుకుందాం.. మేము మీకోసమే ఎదురుచూస్తున్నాం’ అనే సందేశంతో అమెరికాకు సవాల్ విసిరింది. రెండు రోజుల కిందట ఇరాన్ ఆంగ్ల పత్రిక టెహ్రాన్ టైమ్స్ సైతం ‘నరకానికి స్వాగతం’ అనే శీర్షికతో అమెరికా సైనికులను హెచ్చరిస్తూ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే.

పూర్తి సైనిక సన్నద్ధతతో ఉన్న సైనికులు యుద్ధ విన్యాసాలు, కఠినమైన భూభాగం గుండా దళాలు ముందుకు సాగడం వీడియోలో కనిపిస్తుంది. మరో క్లిప్‌లో, ఇరాన్ సైన్యానికి చెందిన ఒక భారీ క్షిపణి ప్రయోగ వాహనం తన ఆయుధాన్ని పేల్చడం, ఆ తర్వాత పేలుళ్లు సంభవించడం కనిపిస్తుంది. క్షిపణి ప్రయోగాలు, డ్రోన్లు, యుద్ధ విన్యాసాలతో కూడిన దృశ్యాలు అమెరికా, ఇరాన్ మధ్య నెలకున్న ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయి…