ఇరాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం.!

*ఇరాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం*

ఇరాన్‌లోని ఈశాన్య నగరం కష్మార్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.9గా నమోదైంది.

ఈ ఘటనలో నలుగురు మరణించగా..120 మందికి పైగా గాయపడ్డట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

మధ్యాహ్నం 1:24 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం 10కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్టు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.