ఓ వ్య‌క్తి శ‌రీరంలోకి చొచ్చుకెళ్లిన 3 అడుగుల ఇనుప చువ్వ‌(10 ఎంఎం సైజు) ను తొలగించిన వైద్యులు…

కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన తాపీ మేస్త్రి కె.లక్ష్మయ్యకు తిరుపతి స్విమ్స్‌ వైద్యులు సోమవారం అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. శనివారం తాపీ పని చేస్తూ ప్రమాదవశాత్తు లక్ష్మయ్య కిందపడ్డాడు. స్థానికులు అతన్ని కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.. ఓ వ్య‌క్తి శ‌రీరంలోకి చొచ్చుకెళ్లిన 3 అడుగుల ఇనుప చువ్వ‌ను(10 ఎంఎం సైజు) వైద్యులు తొల‌గించారు.ఈ నెల 27న ప‌ని చేస్తుండ‌గా, పై అంత‌స్తు నుంచి కింద‌ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో అత‌ని పిరుదుల నుంచి ఎడ‌మ భుజం వ‌ర‌కు 3 అడుగుల ఇనుప చువ్వ చొచ్చుకెళ్లింది…స్విమ్స్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సీటీసర్జరీ, అనస్థీషియా విభాగాల వైద్యులు పేషెంట్‌ స్థితిగతులను వైద్య పరీక్షల ద్వారా గుర్తించారు. 10 ఎంఎం సైజు ఇనుప కడ్డీ దాదాపు మూడు అడుగుల పొడవు అతని శరీర భాగంలోకి చొచ్చుకుని పోయిందని నిర్ధారించారు. అతిక్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి బాధితుడికి ప్రాణం పోశారు. శరీర భాగంలోని అవయవాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుని ఆ ఇనుప కడ్డీని శరీరం నుంచి వేరు చేశారు. శస్త్రచికిత్సను విజయవంతం చేసిన సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ వెంకటరామిరెడ్డి, డాక్టర్‌ సత్యవతి, డాక్టర్‌ మధుసూదన్‌ల బృందాన్ని స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంగమ్మ అభినందించారు…