ఐరాసలో భారత్, పాకిస్తాన్ మద్దతిచ్చుకున్నాయి… భారత్ నిర్ణయంతో సభ్యదేశాలు సైతం హర్షం వ్యక్తం…!

భారత్, పాకిస్తాన్ లు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది ? దీనికి సమాధానం ఐక్యరాజ్యసమితిలో దొరికింది. ఐరాసలో గతంలో ఎన్నో అంశాల్లో విభేదిస్తూ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకునే ఇరుదేశాలు ఈసారి మద్దతిచ్చుకున్నాయి…ఫలితంగా భారత్ పై నిత్యం విషం కక్కే పాకిస్తాన్ ఐరాసలో తన పంతం నెగ్గించుకుంది. భారత్ తో పాటు చైనా కూడా ఈ విషయంలో పాకిస్తాన్ కు అండగా నిలిచాయి.యూరప్ లోని స్వీడన్ లో ఖురాన్ దహనం ఘటన కలకలం రేపుతోంది. దీనికి నిరసనగా ఐరాసలో పాకిస్తాన్, పాలస్తీనా దేశాలు ఓ తీర్మానం ప్రవేశపెట్టాయి. ఐరాస మానవ హక్కుల మండలిలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై సభ్య దేశాలు తమ అభిప్రాయాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఖురాన్ దహనం ద్వారా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన స్వీడన్ పై చర్యలు కోరుతూ పాకిస్తాన్-పాలస్తీనా తీర్మానం ప్రవేశపెట్టి భారత్ మద్దతు కోరాయి…దీనికి స్పందనగా భారత్ మద్దతివ్వాలని నిర్ణయించింది. మానవ హక్కుల విషయంలో తమ వైఖరికి అనుకూలంగా ఉండటంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో చైనాతో పాటు పలు దేశాలు కూడా పాకిస్తాన్-పాలస్తీనా తీర్మానానికి అండగా నిలిచాయి. దీంతో తీర్మానం 28-12 తేడాతో నెగ్గింది. దీంతో ఐరాస ఛాంబర్లో హర్షధ్వానాలు వినిపించాయి. సరిహద్దులు,తీవ్రవాదం వంటి అంశాల్లో పరస్పరం కలహించుకుంటున్నా భారత్.. పాకిస్తాన్ తీర్మానానికి మద్దతివ్వడంపై సభ్యదేశాలు సైతం హర్షం వ్యక్తం చేశాయి.