హమాస్ ఉగ్రవాదులను ఎట్టిపరిస్థితుల్లో వదలకూడదనే పట్టుదలతో ఉన్న ఇజ్రాయెల్ దళాలు(ఐడీఎఫ్) కీలకమైన ‘నాక్ ఆన్ ది రూఫ్’ విధానానికి స్వస్తి చెప్పే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
జరిగితే గాజాలో భారీగా రక్తపాతం తప్పదు. దాదాపు పుష్కరకాలం క్రితం తీసుకువచ్చిన ఈ ఎత్తుగడతో గాజాలో చాలా మంది పౌరులు ఇజ్రాయెల్ దాడుల కంటే ముందే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తమ మధ్య తిరుగుతూ తలదాచుకున్న హమాస్ మూకలు సృష్టించిన నరమేధం.. గాజావాసులకు ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది.
ఎందుకు ఈ ‘నాక్ ఆన్ ది రూఫ్’..?
2006లో ఓ సొరంగ మార్గం ద్వారా ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్‌ను హమాస్ కిడ్నాప్ చేసింది. తర్వాత ఐడీఎఫ్ బలగాలు గాజాలో ఆ సొరంగం ఉన్న ఇంటిపై దాడి చేసి ముష్కరులను హతమార్చాయి. ఆ తర్వాత సొరంగాన్ని పూడ్చివేశాయి. వెంటనే హమాస్ కస్సం రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించడం.. దానికి జవాబుగా ఐడీఎఫ్ వైమానిక దాడులను చేయడం జరిగిపోయాయి. ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు
దానికి జవాబుగా ఐడీఎఫ్ వైమానిక దాడులను చేయడం జరిగిపోయాయి. ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు శాంతి కోసం ఈజిప్ట్‌తో చర్చలు జరుపుతుండగానే.. ఐడీఎఫ్ బలగాలు హమాస్‌పై టార్గెట్ చేసుకోదగ్గ లక్ష్యాలను సేకరించడం మొదలుపెట్టాయి. ఇందులో హమాస్ సాయుధలకు ఆశ్రయం ఇచ్చే కార్యాలయాలు, ఆయుధ కేంద్రాలు, కమాండ్ పోస్టులు, టన్నెల్స్ ద్వారాలు, రాకెట్ లాంఛర్లు, ఇళ్లు, పాఠశాలలు, వైద్యశాలలు, ప్రార్థనా మందిరాలు వంటివి ఉన్నాయి. ఆ తర్వాత ‘ఆపరేషన్ క్యాస్ట్ లీడ్’ను ప్రారంభించాయి. భారీ సంఖ్యలో ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్ గన్‌షిప్‌లు విరుచుకుపడ్డాయి. 170 లక్ష్యాలను భస్మీపటలం చేశాయి. కానీ, ఈ దాడిలో 200 మంది గాజా వాసులు మరణించారు. దీంతో ఐరాస నిజనిర్ధారణ కమిటీ ఇజ్రాయెల్ యుద్ధనేరాలకు పాల్పడిందని ఆరోపించింది.