భారత్, కెనడా మధ్య వివాదాన్ని పెద్దగా చేసేందుకు ఐఎస్ఐ కుట్ర..!!

నిజ్జర్‌ను చంపడానికి ISI నేరస్థులను నియమించిందని, గత రెండేళ్లలో కెనడాకు వచ్చిన గ్యాంగ్‌స్టర్‌లకు పూర్తిగా మద్దతు ఇవ్వమని అతనిపై ఒత్తిడి తెచ్చిందని కూడా వర్గాలు తెలిపాయి. అయితే, నిజ్జర్ మొగ్గు మాజీ ఖలిస్తానీ నాయకుల వైపే ఉంది. నిజ్జర్ హత్య తరువాత, ISI ఇప్పుడు కెనడాలోని ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాదులను సమీకరించడానికి సిద్ధమవుతోందని కూడా వర్గాలు నమ్ముతున్నాయి.బ్రిటీష్ కొలంబియాలో జూన్ 18న తన దేశ గడ్డపై హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల ఆరోపించిన తర్వాత దౌత్యపరమైన వివాదం చెలరేగింది. ఆ తర్వాత న్యూ ఢిల్లీ.. కెనడా వాదనను తిప్పికొడుతూ.. ఆ ఆరోపణలన్నీ అసంబద్ధం, ప్రేరేపితమైనవని తిరస్కరించింది. ఈ క్రమంలోనే కెనడియన్ పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దేశంలో దౌత్యపరమైన ఉనికిని తగ్గించుకోవాలని ఒట్టావాను కోరింది.

భారతదేశంలోని ఖలిస్తానీ-గ్యాంగ్‌స్టర్ల (terrorist) కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బుధవారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మొత్తం మీద దాదాపు 50 చోట్ల ఎన్ఐఏ దాడులు నిర్వహించి దేశద్రోహులకు (NIA)అధికారులు షాక్ ఇచ్చారు…విదేశాల్లో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాదులు (canada) హవాలా ద్వారా డ్రగ్స్ మరియు ఆయుధాల కోసం భారతదేశంలోని కొందరు సానుభూతిపరులకు చెల్లిస్తున్నారని ఏజెన్సీ (NIA)వర్గాలు తెలిపాయి. భారత్‌లో ఖలిస్తానీ (terrorist)కార్యకర్తలు, వాటి ప్రమేయం గురించి కూడా ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ (terrorist)హత్యపై భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన విభేదాల మధ్య ఖలిస్తానీ (canada) ఉగ్రవాదులపై భారత్ సాహసోపేతమైన చర్య తీసుకుంది..పంజాబ్ రాష్ట్రంలోని కేటిఎఫ్ (ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్)కి చెందిన టెర్రరిస్టు (terrorist) అర్ష్ దల్లా నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఎ (NIA) దాడులు చేసింది. ఎన్ఐఏ అధికారులు (NIA) సోదాలు నిర్వహిస్తున్న ఇతర ప్రదేశాలలో హ్యారీ మౌర్, గురుప్రీత్ సింగ్ (terrorist) గురి మరియు గుర్మైల్ సింగ్‌ల అధికారి బృందం సభ్యులు ఉన్నారు.