ఇస్రోపై నిత్యం వందకు పైగా సైబర్ దాడులు..

ఇస్రోపై నిత్యం వందకు పైగా సైబర్ దాడులు జరుగుతూనే ఉన్నాయని ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. కేరళ కొచ్చిలో అంతర్జాతీయ సైబర్ సదస్సులో శనివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు…రాకెట్ టెక్నాలజీలోని అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌పై సైబర్ దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్ని. అన్ని దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని ఇస్రోకు బలమైన సైబర్ సెక్యూరిటీ ఉందని పేర్కొన్నారు. అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌తో పాటు రాకెట్‌లోని విభిన్న కాంపోనెంట్స్ భద్రతపై ప్రత్యేకంగా నిఘా ఉంచామని అన్నారు.