ఇజ్రాయేల్ పై దాడి చేశామే అని మేమేమీ సిగ్గు పడడం లేదు…ఘాజీ హమాద్, హమాస్ ప్రతినిధి..

ఇజ్రాయేల్ పై చేసిన దాడుల్ని (Israel Hamas War) సమర్థించుకుంటోంది హమాస్.

అక్టోబర్ 7న ఉన్నట్టుండి మెరుపు దాడులు మొదలు పెట్టింది…

అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అయితే…హమాస్ని అంతం చేసేంత వరకూ వదలం అని ఇజ్రాయేల్ శపథం చేసింది. ప్రధాని బెంజిమన్ నెతన్యాహు చాలా పట్టుదలతో ఉన్నారు. గాజా వద్ద ఉన్న బంకర్లపై దాడులు చేస్తోంది ఇజ్రాయేల్ సైన్యం. శరణార్థుల క్యాంప్లలోనూ హమాస్ ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న అనుమానంతో వాటిపైనా దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే హమాస్ ప్రతినిధి ఘాజీ హమాద్ (Ghazi Hamad) చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇజ్రాయేల్కి గుణపాఠం నేర్పేందుకు మళ్లీ మళ్లీ దాడులు చేసేందుకైనా సిద్ధమే అని తేల్చి చెప్పారు. Middle East Media Research Institute (MEMRI) ఈ వ్యాఖ్యల్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇజ్రాయేల్పై దాడి చేసినందుకు తాము సిగ్గుపడడం లేదని స్పష్టం చేశారు ఘాజీ హమాద్. “ఇజ్రాయేల్ పై దాడి చేశామే అని మేమేమీ సిగ్గు పడడం లేదు. అసలు ఆ గిల్ట్ లేనే లేదు. ఇజ్రాయేల్కి గుణపాఠం నేర్పాలనుకున్నాం కాబట్టే దాడులు చేశాం. మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటాం. మా నేలపై వాళ్ల పెత్తనం ఉండనే కూడదు. వాళ్లకు ఆ హక్కు లేదు. పాలస్తీనా ప్రజలకు ఆక్రమణల బాధితులుగా మిగిలిపోవాల్సిన ఖర్మ లేదు. మా దాడులతో అయినా ఇజ్రాయేల్ ఆక్రమణలు ఆగిపోతాయని అనుకుంటున్నాం. పాలస్తీనాకి చెందిన నేలను ఇజ్రాయేల్ ఆక్రమించడం ఆగిపోవాలి”

– ఘాజీ హమాద్, హమాస్ ప్రతినిధి