ఉక్కు నుండి అంతరిక్షం వరకు ఇస్రో సాధించిన ప్రగతి దేశాభివృద్ధికి వెన్నెముకలా నిలిచింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐఎస్‌ఆర్‌ఓ) ఏర్పాటు చేసి, 1975లో భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించారు. ఆ తరువాత అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన ప్రగతి అజరామరం. ఏకధాటిగా ఒకేసారి 104 కృత్రిమ ఉపగ్రహాలను కక్ష్యలో నిలబెట్టింది ఇస్రో. చంద్రుడు, అంగారకుడు (మార్స్) పైకి ఉపగ్రహాలను పంపే స్థాయికి ఎదిగాం..విశ్వవేదికపై భారత ఖ్యాతిని ధృవతారగా నిలిపించది ఇస్రో. మొదటి ప్రయత్నంలోనే కుజగ్రహాన్ని విజయవంతంగా చేరడం (మంగళ్‌యాన్), ఒకే ప్రయత్నంలో 10 ఉపగ్రహాలను ప్రయోగించడం, దేశీయ పరిజ్ఞానంతో తయారైన క్రయోజెనిక్ రాకెట్ యంత్రాల సహాయంతో భారీ భూస్థావర ఉపగ్రహాలను ప్రయోగించడం, చంద్రయాన్ పేరుతో మానవ రహిత అంతరిక్షయాత్రను నిర్వహించడం వంటి ఎన్నో ఘన విజయాలను ఇస్రో సాధించింది..