మరో ఘారానా మోసం ..ఉద్యోగాల పేరిట ఐటీ కంపెనీ మోసం.. రోడ్డున పడ్డ నిరుద్యోగులు…!.

నిరుద్యోగులు షాక్‌....మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన ఇన్నోహబ్‌ టెక్నాలజీస్‌..!!!. రోడ్డున పడ్డ ఎనిమిది వందల మంది ఉద్యోగులు..

మాదాపూర్‌లో ఇన్నోహబ్‌ టెక్నాలజీస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో 800 మంది సాఫ్ట్‌ వేర్ ఉద్యోగులు రోడ్డునపడ్డారు. మంచి ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద సుమారు 2 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.20 కోట్లు వసూలు చేసి యువతియువకులకు కుచ్చుటోపి పెట్టింది. రెండు నెలలపాటు నమ్మకంగా ఉంటూ ట్రైనింగ్ పేరిట జీతాలు సైతం చెల్లించారు.ఇటీవల రెండు వారాల క్రితం ఒక్కసారిగా ఆ కంపెనీ వెబ్‌సైట్, మెయిల్స్‌ బ్లాక్ అయ్యాయి. సంస్థకు సంబంధించిన ఆఫీస్‌లో ఉద్యోగులు, కంపెనీ బోర్డు లేకపోవడంతో నిరుద్యోగులంతా షాక్‌ అయ్యారు. మోసపోయినట్లు గ్రహించి మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐనా పోలీసులు స్పందనలేకపోవడంతో మాదాపూర్‌ స్టేషన్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు…ఐటీ కంపెనీ మోసంపై మాదాపూర్‌ సీఐ రవీంద్ర ప్రసాద్ స్పందించారు. ఈనెల 28న హన్మకొండకు చెందిన యువకుడు తమకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. కొత్తగూడలోని ఇన్నోహబ్‌ టెక్నాలజీస్‌ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ నిరుద్యోగుల నుంచి లక్షన్నర రూపాయలు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కేసులో విచారణ జరుగుతోందన్నారు. ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులను గుర్తించామని..త్వరలో మరిన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఇలాంటి కంపెనీల పట్ల జాగ్రత్తంగా ఉండాలని హెచ్చరించారు…