ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి… మంత్రి కేటీఆర్.

చౌటుప్పల్ మండలం డి మల్కాపూర్ IT పార్క్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు పరిశ్రామిక ప్రగతి వేడుకలకి ముఖ్యఅతిథిగా విచ్చేసి సాయి దీప రాక్ డ్రిల్లింగ్ టూల్స్, అగ్రిఘర్ ప్రైవేట్ లిమిటెడ్, సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, సోడా హబ్ పరిశ్రమల ప్రారంభోత్సవ కార్యక్రమములో పాల్గొన్న ఐటీ మున్సిపల్ మైనింగ్ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు,..

యాదాద్రి జిల్లా…..
:::::::::::::
చౌటుప్పల్ మం….
దండుమల్కాపూర్ గ్రీన్ ఇండీస్ట్రియల్(industrial park) పార్క్ లో జరిగిన
తెలంగాణ
పారిశ్రామిక ప్రగతి ఉత్సవం లో
ఐటి ,పరిశ్రమల మంత్రి KTR ..
మాట్లాడుతు……………….
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి సాధించింది…
పర్యావరణం,పరిశ్రమల రంగాల్లో అద్భుతమైన ప్రగతి జరిగింది…
తెలంగాణ లో సమగ్ర, సమత్యులత,సమ్మిళిత అభివృద్ధి జరిగింది….
పరిశ్రమల ఏర్పాటు లో అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ……
TS ఐ పాస్ విధానంలో 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ…..అమెరికా లో కూడా ఇలాంటి విధానం లేదు అని అక్కడి పారిశ్రామిక వేత్తలు చెప్పారు……మానవ చరిత్రలో మూడవ అతి పెద్ద కార్యక్రమం మన హరితహారం కార్యక్రమం..
బౌష్యత్తు తరాలకు పచ్చటి వాతావరణం అందిస్తున్నాం…
పల్లె పాలనలో 30 జాతీయ స్థాయి అవార్డు లు మన పల్లెలు సాధిస్తున్నాయి… పట్టణాలు కూడా జాతీయ అవార్డు లు అందుకుంటున్నాయి….
తెలంగాణ లో మారు మూల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఇవ్వాళ సంతోషంగా ఉన్నరు……తెలంగాణ ను అవహేళన చేసిన వాళ్ళు కనుమరుగు అయ్యారు…
సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ ని పొగిడారు…. ఆయన ఎన్నో దేశాలు తిరుగుతారు… మన హైదరాబాద్ అత్యద్భుతంగా అభివృద్ధి జరిగింది అని కితాబు ఇచ్చారు…
గుజరాత్ రాష్ట్రంలో ఈ రోజుకు కూడా కరంట్ కోతలు ఉన్నాయి…..
పక్కా రాష్ట్రాల్లో వెళ్లి ఎలాంటి పరిస్థితి ఉందొ తెలుసుకోండి…
పచ్చదనం కి మారు పేరు తెలంగాణ(Telangana)..
గ్రీన్ బడ్జెట్ పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ….
నెస్ట్ జనరేషన్ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి మన కేసీఆర్……
60 ఏళ్లలో జరిగిన పని ఈ తొమ్మిది ఏళ్లలో చేసి చూపారు మన ముఖ్యమంత్రి……
కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర దేశాలకు పాఠాలు నేర్పుతుంది అని అమెరికా ఇంజనీర్లు అన్నారు..అది తెలంగాణ కు దక్కిన గొప్ప గౌరవం…..it ఎగుమతులను పెంచాము….. ధాన్యం దిగుబడులు రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి…. ఇవి తెలంగాణ విజయాలు……
వాస్తవాలు చెప్పుకోవాలి…
అన్ని రంగాల్లో తెలంగాణ అఖండ విజయాలను సాధించింది….
దండుమల్కాపూర్ పార్క్ లో ఏర్పాటు చేసిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ లో వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తాం…….. అన్నారు ఈ కార్యక్రమంలో

విద్యుత్ శాఖమాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి,(mantri Jagadish Reddy) ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, TSIIC ltd చైర్మన్ గ్యాదరి బాలమళ్ళు, TIF ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి, TSTTCFCL చైర్మన్ పల్లె రవి కుమార్ , రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మునుగోడు శాసనసభసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , నకిరేకల్ శాసనసభ సభ్యులు చిరమర్తి లింగయ్య, భువనగిరి శాసనసభ సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి , తుంగతుర్తి శాసనసభ సభ్యులు గాదరి కిషోర్, శాసనమండలి సభ్యులు ఎల్ రమణ l, IT ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.