చంద్రబాబుకు ఐటీ నోటీసులపై తాజాగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి స్పందించారు..
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన నోటీసులు రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శల జడివానను ఎదుర్కొంటోన్నారాయన. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు చంద్రబాబుపై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు…తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులను అప్పగించిన ప్రతి కాంట్రాక్ట్ సంస్థ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు చంద్రబాబు. 118,98,13,207 కోట్ల రూపాయల లంచాన్ని తీసుకున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ కేసులో ఐటీ శాక అధికారులు దర్యాప్తు సాగిస్తోన్న కొద్దీ.. కొత్త విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి..చంద్రబాబు తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేయొచ్చని అంచనా వేశారు. తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు వైసీపీ ప్రభుత్వం దిగుతోందని మండిపడ్డారు. తాను నిప్పునని, ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఏ కేసులో ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు…
చంద్రబాబుకు ఐటీ నోటీసులపై తాజాగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి స్పందించారు. కోటి రూపాయలంటే ఒక టన్ను స్టీల్ అనే పదజాలాన్ని కూడా చేర్చాలని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేర్చాలంటూ ఉత్సాహవంతులైన యువతీ, యువకులు కోరుకుంటోన్నారని సెటైర్లు వేశారు.
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ యాజమాన్యానికి వారు మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. టన్ను స్టీల్ అనే పదాన్ని కోటి రూపాయలకు ప్రత్యామ్నాయంగా వాడిన ఆ క్రెడిట్ కూడా చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు. కొత్త కొత్త టెక్నాలజీని కనుగొన్న చంద్రబాబుకు ఈ పదాలను కూడా సృష్టించగలరని వ్యాఖ్యానించారు.