మల్లారెడ్డి వైద్య కళాశాలపై ఈడీ అధికారుల దాడులు..!!!

మెడికల్ కాలేజీలపై బుధవారం దాడులు చేసిన ఈడీ అధికారులు విచారణలో వెళ్లడైన వివరాల ఆధారంగా మనీ లాండరింగ్ కేసులు నమోదు చేశారు. జరిపిన తనిఖీల్లో మల్లారెడ్డి వైద్య కళాశాల నుంచి కోటి నలభై లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతాలో ఉన్న మరో రెండు కోట్ల ఎనభై లక్షలను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. 12 మెడికల్ కాలేజీలు, సంబంధిత వ్యక్తుల కార్యాలయాల్లో సోదాలు చేసినట్టు తెలిపారు. మొత్తం 16 చోట్ల తనిఖీలు జరిగాయన్నారు. పీజీ, మెడికల్ సీట్లను బ్లాక్ చేసినందుకు దాడులు చేసినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్‌తో పాటు పలుచోట్ల తనిఖీలు చేశామన్నారు. కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వెళ్లడైన ఆధారాల నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసులు పెట్టినట్టు తెలిపారు.