మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు, మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లా రెడ్డి కాలేజీల్లో 50 చోట్ల సోదాలు……
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు*
మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లా రెడ్డి కాలేజీల్లో సోదాలు
హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 50 చోట్ల ఐటీ శాఖ తనికీలు
మంత్రి మల్లారెడ్డి పై ఐటీ శాఖ మెరుపు దాడులు
మల్లారెడ్డి కూతురు కొడుకు అల్లుళ్ళ నివాసాలతో పాటు మల్లారెడ్డి, తమ్ముళ్ల నివాసాలపై సోదాలు…
50 టీమ్స్ సహాయం తో సోదాలు…
మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు…
కొంపల్లి లోని విల్లాలో నివాసం ఉంటున్న మహేందర్ రెడ్డి..
తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ శాఖ మెరుపు దాడులు చేసింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఇరుజిల్లాల్లో మొత్తం 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా మల్లారెడ్డి కూతురు కొడుకు, అల్లుడి నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు….కొంపల్లిలోని విల్లాలో నివాసం ఉంటున్న మహేందర్ రెడ్డి మల్లారెడ్డి కాలేజీలకు డైరెక్టర్‌గా ఉన్నారు…ఇటీవల, తెలంగాణలోని మరో మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లల్లో ఐటీ రైడ్స్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, మరోమంత్రి ఇంట్లో ఐటీ రైడ్స్ జరగడం కలకలం రేపుతోంది.