హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ విజయం…2004 నుండి 2021 వరకు ఈటల రాజేందర్ కి వచ్చిన మెజారిటీ వివరాలు…

హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ విజయం.
R9TELUGUNEWS.com.
2004 నుండి ఓటమీ తెలియని వ్యక్తి…
23.865 మెజారిటీతో విజయం..

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై ఈటల గెలుపొందారు.హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ విజయం.. మొదటి నుంచి టీఆర్ఎస్‌పై ఆధిక్యత లభించింది…,
హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. హుజూరాబాద్ నుంచి కమలం పార్టీ తరపున బరిలోక దిగి మంచి మెజార్టీతో విజయం సాధించారు. హోరాహోరీగా సాగుతుందనుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గులాబీ పార్టీపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు….దాదాపు 23865 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్‌ మొదలైనప్పటి నుంచి చివరి వరకూ ఈటల ఆధిక్యంలోనే కొనసాగారు. ఎనిమిదో రౌండ్‌, 11వ రౌండ్‌లో మాత్రం గెల్లు స్వల్ప ఆధిక్యం కనబర్చారు. ఈటల విజయం సాధించడంతో భాజపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. .

R9TELUGUNEWS.com
*2004 నుండి 2021 వరకు ఈటల రాజేందర్ కి వచ్చిన మెజారిటీ వివరాలు*

2004:
కమలాపూర్ నియోజకవర్గం:
ఈటెలరాజేందర్ : 68393.
ముద్దసాని దామోదర్ రెడ్డి: 48774.
మెజారిటీ: 19619.

2008:
కమలాపూర్ నియోజకవర్గం:
ఈటెలరాజేందర్ : 54092
ముద్దసాని దామోదర్ రెడ్డి: 31808.
మెజారిటీ: 22,284.

2009 :
హుజూరాబాద్ నియోజకవర్గం :
ఈటెలరాజేందర్ : 56752
కృష్ణమోహన్ వకులాభరణం: 41717.
మెజారిటీ: 15,035.

2010:
హుజూరాబాద్ నియోజకవర్గం :
ఈటెల రాజేందర్: 93026
ముద్దసాని: 13799
మెజారిటీ: 79227.

2014:
హుజూరాబాద్:
ఈటెల రాజేందర్: 95315
కేతిరి సుదర్శన్ రెడ్డి : 38278
మెజారిటీ: 57,037.

2018
హుజూరాబాద్:
ఈటల రాజేందర్ : 104840
కౌశిక్ రెడ్డి: 61121.
మెజారిటీ: 43719…

2021..
హుజూరాబాద్..
ఈటెల.. మెజారిటీ..(23..865).