ఈటల రాజేందర్‌ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్‌ అసైన్డ్‌ భూములను కబ్జా చేశారు.. మెదక్‌ కలెక్టర్‌

R9TELUGUNEWS.COM మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్‌ అసైన్డ్‌ భూములను కబ్జా చేసిందని మెదక్‌ కలెక్టర్‌ అన్నారు. 70.33 ఎకరాలు కబ్జా చేసినట్లు సర్వేలో తేలిందని చెప్పారు. ఈటల భూముల అంశంపై కలెక్టర్‌ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్లు తేలింది. అచ్చంపేట, హకీంపేట పరిధిలో అసైన్డ్‌ భూముల కబ్జా జరిగింది. జమునా హేచరీస్‌ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసింది. అసైన్డ్‌ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారు. అనుమతులు లేకుండా పెద్ద పెద్ద షెడ్లు నిర్మించారు. నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీప్రాంతంలో చెట్లు నరికి, రోడ్లు వేశారు’’ అని కలెక్టర్‌ చెప్పారు.