ప్రేమ పేరుతో జబర్దస్త్ ఆర్టిస్ట్ మోసం…!

.

జబర్దస్త్ కామెడీ షో తెలుగు టెలివిజన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది కామెడీయన్లు వచ్చారు. అలాగే హీరోలు, డైరెక్టర్లు కూడా అయ్యారు.

ఈ కామెడీ షో ఇప్పటికీ విజయవంతగా ఈటీవీలో టెలికాస్ట్ అవుతోంది. తాజాగా జబర్దస్త్ ద్వారా పరిచయమైన కమెడియన్, సింగర్ నవ సందీప్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

నవ సందీప్ తనకు 2018 వాట్సాప్ చాటింగ్ ద్వారా పరిచమైనట్లు 28 ఏళ్ల యువతి తన ఫిర్యాదు లో పేర్కొంది. ఆ పరిచయం ప్రేమగా మారిందని పేర్కొంది. ఈ తన ఇంట్ల తెలియడంతో నవ సందీప్ తనను హైదరాబాద్ కు తీసుకొచ్చాడని వివరించింది..

హైదరాబాద్ వచ్చిన తనను షేక్ పేటలోని అల్ హమారా కాలనీలోని ఓ హాస్టల్ లో ఉంచినట్లు ఫిర్యాదు లో పేర్కొంది. తాను గత నాలుగు సంవత్సరాలుగా హాస్టల్ ఉంటున్నట్లు తెలిపింది..

గత నాలుగు సంవత్సరాలుగా నవసందీప్ తాను ప్రేమించికుంటున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో శారీరకంగా కలిసినట్లు ఫిర్యాదులో వివరించింది. తనన పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే నవ సందీప్ కు శరీరకంగా దగ్గరైనట్లు పేర్కొంది.

నాలుగు సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికైనా పెళ్లి చేసుకోవాలని నవ సందీప్ ను కోరినట్లు తెలిపింది. అయితే పెళ్లి మాట ఎత్తినప్పుడు దాటవేస్తు వస్తున్నట్లు చెప్పింది. గట్టిగా అడిగేసారికి తానంటే ఇష్టం లేదని చెప్పడాని సదరు యువతి ఫిర్యాదులో వివరించింది.

నవసందీప్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెబుతున్నట్లు యువతి చెప్పింది. యువతి ఫిర్యాదుతో గోల్కొండ పోలీసులు జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును మధఉరానగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.

దీంతో ఈ కేసును మధురానగర్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంపై నవ సందీప్ ఇప్పటి వరకు స్పందించలేదు.