ధాన్యం కొనుగోలులో చాలా గోల్ మాల్ జరుగుతుంది.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..

*సూర్యాపేట జిల్లా..*

ఈనెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్యనేతలతో సన్నాహక సమావేశ నిర్వహించి.. అనంతరం మీడియాతో మాట్లాడిన *మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి*..

మాజీ ఎంపీ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగులు లింగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లు గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, ఒంటెద్దు నర్సింహా రెడ్డి, గుజ్జ యుగంధర్ రావు పాల్గొన్నారు.

*మాజీమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..*

తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29..

తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో.. అన్న నినాదమే ఉద్యమానికి ఊపిరి..

రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఆరోజే కీలకం..

కెసిఆర్ ఆమరణ దీక్షతోనే కేంద్ర మెడలు వంచిండు..

ఆ దీక్షతోటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది..

ఉద్యమం ఉవ్వెత్తున లేచి.. అన్ని రంగాలు ఐక్యతతో కలిసి వచ్చినయ్..

అందుకే ఆరోజు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు..

జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి దీక్షదివాస్ కు సిద్ధమవుతున్నారు..

రాష్టానికే ఆదర్శంగా సూర్యాపేటలో దీక్షదివాస్ ను నిర్వహించుకుందాం ..

కేవలం డబ్బు సంపాదనే రేవంత్ లక్ష్యం..

అందుకే పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడుతున్నడు..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుంది..

ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కు కేటాయించిన భూముల్లో ప్రభుత్వ మోసం స్పష్టంగా కనిపిస్తోంది..

కోకాపేటలో ఎకరం 100 నుంచి 170 కోట్లు వేలంలో విక్రయించినట్లు చెబుతున్న ప్రభుత్వం..

ఇప్పుడు అదే ప్రాంతంలో అతి తక్కువ ధరకు విక్రయించడంలో అర్ధమేంటి..

ప్రజాధనం దోచుకోవడంపైనే రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది..

ప్రభుత్వ భూముల కుంభకోణంపై వచ్చే ప్రభుత్వంలో విచారణ తప్పదు..

ప్రజల ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న వారు ఎవరైనా వదిలిపెట్టం..

భూ కుంభకోణంలో సహకరించిన వాళ్లంతా జైలుకు వెళ్లక తప్పదు..

ధాన్యం కొనుగోలులో చాలా గోల్ మాల్ జరుగుతుంది..

ఐకెపి సెంటర్లలో సరిగ్గా ధాన్యం కొనడం లేదు..

మ్యాచ్చర్ వస్తలేదని రైతులను ఇబ్బంది పెడుతున్నారు..

దళారుల చేతుల్లో రైతులు తీవ్రంగా మోసపోతున్నారు..

మళ్లీ 2014 ముందున్న సమస్యలే తలెత్తుతున్నాయి..

*బీసీలను పెద్ద ఎత్తున మోసం చేసిన పార్టీ కూడా కాంగ్రెస్సే..*

రేవంత్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చి విస్మరించింది..

తెలిసే మోసం చేసి.. తప్పించుకునేందుకు సాకులు వెతుకుతుంది..

కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిన చందంగా ఉంది బీసీల పరిస్థితి..

BC రిజర్వేషన్లు పెంచుతామని ఉన్న రిజర్వేషన్లు పోగొట్టుకునే పరిస్థితి..

అందుకు అనేక చోట్ల BC లకు జీరో రిజర్వేషన్లు రావడమే నిదర్శనం..

బీసీల కోసం బిఆర్ఎస్ ఉద్యమిస్తది..

బీసీల తో పాటు అన్ని రంగాల ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగింది..

కెసిఆర్ ని వదులుకున్నామన్న భావన అందరిలో కలుగుతుంది..

స్థానిక సంస్థలలో బిఆర్ఎస్ విజయకేతనం తప్పదు..