ఇకపై 24 గంటల మంచినీరు రోడ్ల నిర్మాణాలు వేగవంతం….మంత్రి జగదీష్ రెడ్డి.

ఇకపై 24 గంటల మంచినీరు

రోడ్ల నిర్మాణాలు వేగవంతం

ప్రజల మనసులో బాధలు గుర్తేరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్

అభివృద్ధి లో ప్రజలు భాగస్వామ్యం కావాలి

తడిచెత్త,పొడిచెత్త ప్రక్రియ మొదలు పెట్టింది ఇక్కడే

మొక్కల పెంపకంలో ప్రజాప్రతినిధులు ముందుండాలి

పేద ప్రజల ప్రేమ వేల కట్టలేనిది

మౌలిక సదుపాయాల కల్పనలో ముందుంటాం

యావత్ రాష్ట్రం ఇటువైపు చూసేలా అభివృద్ధి

వచ్చే బతుకమ్మ నాటికి పుల్లారెడ్డి చెరువు మీద బతుకమ్మ సంబరాలు

సూర్యాపేటలో రెండో మినీ ట్యాన్క్ బండ కు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన

సూర్యాపేట పట్టణ ప్రజలకు 24 గంటలు మంచినీరు అందించే రోజులు ఎంతో దూరం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు వెనుక అన్నది గమనిస్తే 2014 తరువాత పట్టణంలో వచ్చిన మార్పు ఏమిటి అనేది ప్రతి ఒక్కరికీ బోధపడుతుందని అయన అన్నారు.మురికి నీటి నుండి విముక్తి పొంది స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా లొనే అభివృద్ధి కనిపిస్తుందని ఆయన చెప్పారు.17.58 కోట్ల అంచనా వ్యయంతో సూర్యాపేట పుల్లారెడ్డి చెరువు మీద నిర్మించ తలపెట్టిన మినీ ట్యాన్క్ బండ నిర్మాణపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ వచ్చిన తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో ఏర్పడ్డ టి ఆర్ ఎస్ ప్రభుత్వం లో కలసికట్టుగా అభివృద్ధి సాదించుకున్నామని ఆయన తెలిపారు. మునుముందు కూడా ఇదే తరహాలో కలసికట్టుగా ముందుకు సాగితే మరింత అభివృద్ధి సాదించుకోవచ్చని ఆయన చెప్పారు. రోజు రోజుకు పెరుగుతున్న పట్టణంలో రోడ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. సూర్యాపేట అంటేనే బొడ్డురాయి బజార్ చుట్టుపక్కల ప్రాంతాలని ఆ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి మార్పుకు దిక్సూచి గా నిలుస్తుందన్నారు.అటువంటి అభివృద్ధి లో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల మనసులోని బాధలను గుర్తేరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉండడం మన అదృష్టమని ఆయన కొనియాడారు. అందుకే మినీ ట్యాన్క్ బండ నిర్మాణాలతో ప్రజలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పుతున్నారని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో ముందున్నామని యావత్ రాష్ట్రం సూర్యాపేట వైపు చూసేలా అభివృద్ధి జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తడిచెత్త పొడిచెత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోనేనని అది ఇప్పుడు అన్నిచోట్లకు రోల్ మోడల్ గా మారిందన్నారు.ఇప్పటికే స్వచ్ఛ సూర్యాపేట గా పేరొందిన సూర్యాపేట లో మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని ఆయన కోరారు.అందులో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. పేద ప్రజల ప్రేమ వెలకట్టలేనిదని అటువంటి ప్రజలు ఉన్న చోట మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వచ్చే బతుకమ్మ నాటికి బతుకమ్మ సంబరాలు పుల్లారెడ్డి చెరువు మీద నిర్మిస్తున్న మినీ ట్యాన్క్ బండ మీద జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు.ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ పుట్టా కిశోర్ తదితరులు పాల్గొన్నారు.