స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నైతిక విజయం.జగ్గారెడ్డి…

R9TELUGUNEWS.COM: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నైతిక విజయం సాధించిందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో నిర్మలా జగ్గారెడ్డి కోసం జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులు బాగా పనిచేసినట్లు చెప్పారు.ఏ ఆలోచనతో పోటీ చేశామో.. ఆ లక్ష్యం నెరవేరిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా, ట్రబుల్ షూటర్ హరీశ్‌ ఉన్నా.. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు కాపాడుకున్నామని వెల్లడించారు. మెదక్‌లో హరీశ్ ట్రబుల్‌లో పడ్డారు. కాంగ్రెస్ భయానికి హరీశ్‌కు క్యాంపులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో గేమ్ స్టార్ట్ అయింది అని జగ్గారెడ్డి వెల్లడించారు…