లక్షల కోట్లు అప్పులు చేసి పోయారని, వాటిని ఎలా తీర్చాలా అని మా మంత్రులు తలపట్టుకున్నారు..మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ గత పాలనపై ఆయన విరుచుకుపడ్డారు. సెక్రటేరియట్ లో తొమ్మిదేళ్ల ఫైళ్లు అన్నీ పెండింగ్ లో ఉన్నాయని, మా మంత్రులు వాటి బూజు దులుపుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, హరీశ్ కు లేదన్నారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ వాళ్లు లక్షల కోట్లు అప్పులు చేసి పోయారని, వాటిని ఎలా తీర్చాలా అని మా మంత్రులు తలపట్టుకున్నారు అని వాపోయారు జగ్గారెడ్డి. తెలంగాణ ప్రజలు అప్పు చేయమని అడిగారా? అని ఆయన బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు..కేబుల్ బ్రిడ్జి కట్టి మీరే ఇంత చెప్పుకుంటే.. ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ ప్రెస్ వే, ఎయిర్ పోర్ట్ సృష్టికర్త వైఎస్ఆర్ ఇంకెంత చెప్పాల్సి ఉండే అని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియా గాంధీ ఇంటికి పోయింది కేసీఆర్ కుటుంబం కాదా? అని నిలదీశారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ మాట ఇచ్చి తప్పినందుకు కోర్టులో కేసు వేస్తామన్నారు జగ్గారెడ్డి.కేసీఆర్ కుటుంబం 420 కాబట్టే ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని కామెంట్ చేశారాయన. కేటీఆర్, హరీశ్ ల కోసం 840 చట్టం తేవాలేమో అని ఎద్దేవా చేశారు. నేను అసెంబ్లీ లోపల ఉంటే కేటీఆర్, హరీశ్ రావులను ఒక ఆట ఆడుకునేవాడిని అన్నారు జగ్గారెడ్డి. హరీశ్ రావు, కేటీఆర్ లకు బస్సు ప్రయాణం తెలియదని, బెంజ్ కార్లలో తిరిగే వాళ్లకు పేదల సమస్యలు ఏం తెలుసు అని విమర్శించారు. 9 ఏళ్ళు కేసీఆర్ పాలన చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తుందన్నారు జగ్గారెడ్డి.